రూట్ మార్చిన రష్యా.. ఉక్రెయిన్ ఆహార సదుపాయాలపై దాడి

-

ఉక్రెయిన్​పై రష్యా ఇంకా భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్య ఒప్పందం నుంచి రష్యా వైదొలిగిన. ఈ నేపథ్యంలో రూట్ మార్చి.. శుక్రవారం రోజున ఉక్రెయిన్‌ రేవు పట్టణాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా ఒడెసా నగరంలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఆహార ధాన్యాల గిడ్డంకులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. శత్రు దేశం రష్యా.. ధాన్య ఒప్పందానికి సంబంధించిన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్‌ సైనిక అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్‌ అనుసరిస్తున్న వైఖరిని, రష్యా సైనిక దళాల సమర్థతను ఎప్పటికప్పుడు విమర్శిస్తున్న రిటైర్డ్‌ భద్రతా అధికారి ఇగోర్‌ను మాస్కో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఉగ్రవాద ఆరోపణలు మోపారు. ఇగోర్‌.. చెచెన్‌ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా రష్యా గతంలో జరిపిన యుద్ధాల్లో పాల్గొన్నారు. సైన్యం నుంచి రిటైరైన తర్వాత వాగ్నర్‌ ముఠా అధినేత ప్రిగోజిన్‌లానే ప్రత్యేక కిరాయి ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముఠా.. 2014లో క్రిమియా ఆక్రమణలోనూ పాల్గొంది.

Read more RELATED
Recommended to you

Latest news