అయ్యో పాపం.. పుణెలో 400 కిలోల టమాటాల చోరీ

-

గత కొన్నిరోజులుగా దేశంలో ఎక్కడ చూసినా టమాట గోడే వినిపిస్తోంది. రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. టమాటాల చుట్టూ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలోనూ ఓ సంఘటన జరిగింది. అదేంటంటే..?

పుణె జిల్లాలోని శిరూర్‌ తహసిల్‌ పరిధిలోని పింపార్‌ఖేడ్‌లో ఓ రైతుకు చెందిన 400 కిలోల టమాటాలను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. బాధిత రైతు అరుణ్‌ ధోమే శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండించిన టమాటాలను ఆదివారం పొలం నుంచి కూలీల సాయంతో ఇంటికి చేర్చానని, సోమవారం ఉదయాన్నే మార్కెట్‌కి తీసుకెళ్లి విక్రయించాలని అనుకున్నట్లు అరుణ్‌ ధోమే తెలిపారు.

ఉదయం లేచే సరికి దొంగలు 20 పెట్టెల్లోని 400 కేజీల టమాటాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు వివరించారు. రూ.20వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజురోజుకు టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి చోరీ ఘటనలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news