ఘోర తప్పిదం.. సొంత నగరంపైనే రష్యా బాంబు దాడి

-

ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలై నరకం అనుభవిస్తున్నారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా మారారు. అయితే ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న రష్యా తాజాగా ఘోర తప్పిదం చేసింది.

రష్యా తన సొంత నగరంపైనే బాంబు దాడి చేసింది. నాలుగు లక్షల జనాభా ఉన్న పట్టణంపై తన యుద్ధ విమానం నుంచి ఓ ఆయుధాన్ని జారవిడిచింది. పేలుడు ధాటికి నగరంలో ఓ కూడలి వద్ద దాదాపు 40 మీటర్ల వ్యాసంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. సమీపంలోని భవనాలు ధ్వంసం కావడంతోపాటు వాహనాలూ ఎగిరిపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

రష్యాలోని బెల్గొరాడ్‌ నగరం ఉక్రెయిన్‌కు సరిహద్దులో (సుమారు 40కి.మీ దూరంలో) ఉంటుంది. గురువారం రాత్రి రష్యాకు చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం ఈ నగరంపై ప్రయాణించింది. అదే సమయంలో యుద్ధ విమానం నుంచి ప్రమాదవశాత్తు ఓ బాంబు జారిపడింది. పేలుడు ధాటికి ఓ కారు ఎగిరి సమీప ఇంటిపైకప్పు మీద పడినట్లు రష్యా వార్తాసంస్థ ఆర్‌ఐఏ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news