ఉక్రెయిన్ దెబ్బకు రష్యా అప్రమత్తం.. డ్రోన్ల భయంతో రెండు విమానాశ్రయాలు మూసివేత..!

-

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మొన్నటి దాకా రష్యా నిరంతర దాడులు చేసింది. ఇప్పుడేమో ఉక్రెయిన్ రివేంజ్ దాడులు చేస్తోంది. మాస్కోపై ఇటీవల ఉక్రెయిన్‌ ఎడతెరిపి లేకుండా చేస్తున్న డ్రోన్‌ దాడులు రష్యాలో భయాన్ని పెంచినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా మాస్కోలోని రెండు విమానాశ్రయాలను కొద్దిసేపు మూసివేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఐఏ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.

వ్నుకోవ్‌ విమానాశ్రయ పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ల కదలికలను గుర్తించడంతో డిపార్చర్స్‌, అరైవల్స్‌లను సస్పెండ్‌ చేసినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెల్లడించాయి. ఎయిర్‌ పోర్టు నియంత్రణకు సంబంధించిన కారణాలతో తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లు ఆర్‌ఐఏ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. దీంతో వ్నుకోవ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లు నిలిచిపోయాయని.. కొన్ని విమానాలను మాస్కోలోని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించినట్లు పేర్కొంది. దీంతోపాటు ఇక్కడకు 150 కిలోమీటర్ల దూరంలోని కల్గా ఎయిర్‌ పోర్టును కూడా కొద్ది సేపు మూసివేశారు.  అనంతరం కొద్దసేపటి రష్యా రక్షణ శాఖ ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version