చిరంజీవికి పాలిటిక్స్‌ సెట్‌కావు : ద్వారంపూడి

-

మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో వస్తారని తాను భావించడం లేదని ఆయన అన్నారు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తాను రాజకీయాలకు సరిపోనని భావించారని అందువల్లే తిరిగి సినీ ఇండస్ట్రీకి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలపైనే ఫోకస్ పెట్టారని తనకు తెలిసిన సమాచారం అని అన్నారు. వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి అన్నారు.

చిరంజీవికి సినిమాల్లోనే సౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రజలను ఎంటర్ టైన్ చేయాలని తాను ఆశిస్తున్నట్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై మాత్రం చాలా సానుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే విరుచుకుపడే ద్వారంపూడి చిరంజీవి విషయంలో ఎందుకు ఇలా స్పందిచారని గుసగుసలాడుకుంటున్నారు.

అయితే.. ఇటీవల భోళా శంకర్‌ సినిమా ప్రమోషన్లో ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని… పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై ఎందుకు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చిరుపై వైసీపీ మంత్రులు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version