రష్యన్‌ కమాండ్‌ విమానాలను కూల్చివేసిన ఉక్రెయిన్‌

-

రష్యా – ఉక్రెయిన్ల మధ్య ఇంకా కొనసాగుతోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ యుద్ధం సాగుతూనే ఉంది. అయితే రష్యన్ దాడులకు ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా రష్యాకు చెందిన రెండు కమాండ్‌ విమానాలను ఉక్రెయిన్‌ కూల్చివేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ వలెరీ జలుజ్ని ధ్రువీకరించారు. రష్యా వైమానిక దళంలో అత్యంత విలువైన ఏ-50 రాడార్‌ డిటెక్షన్‌ విమానం, ఐఎల్‌-22 కంట్రోల్‌ సెంటర్ విమానాన్ని కూల్చినట్లు తెలిపారు. అజోవ్ సముద్రం మీదుగా వెళ్తున్న ఈ రెండు విమానాలను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు చెప్పారు.

ఇది రష్యాకు ఆర్థికంగా పెద్ద దెబ్బ అని జలుజ్ని తెలిపారు. ఆ విమానాల ఖరీదు కొన్ని మిలియన్‌ డాలర్ల పైమాటేనని.. పక్కా ప్రణాళికతో తమ వైమానిక దళం ఈ ఆపరేషన్‌ పూర్తి చేసిందని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై రష్యా స్పందించింది. దీనికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని రష్యన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ దాడితో ఐఎల్‌-22 విమానం రష్యాలోని అనపాలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయింది. ఈ విమానానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version