షాకింగ్: శానిటైజర్ లు చిన్నారుల కళ్ళకు ప్రమాదం

-

ప్రాణాంతకమైన కోవిడ్ -19 కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతున్న… హ్యాండ్ శానిటైజర్స్ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయని ఒక అధ్యయనం తెలిపింది. ఇప్పుడు అవి మన జీవితంలో ఒక భాగంగా మారాయి. మన ఆఫీస్ లు, , పాఠశాలలు, కళాశాలలు, మాల్స్ మరియు ప్రజా రవాణాలో సులభంగా వీటిని వాడుతున్నారు. అయితే పిల్లలలో కంటి సంబంధిత సమస్యలకు హ్యాండ్ శానిటైజర్స్ కారణమని ఒక అధ్యయనం కనుగొంది.

జనవరి 21 న జామా ఆప్తాల్మాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ విషయం ప్రస్తావించారు. హ్యాండ్ శానిటైజర్లు తమ కళ్ళలో అనుకోకుండా వాడిన పిల్లల కంటికి ఎక్కువ గాయాలు ఎక్కువ అయ్యాయి అని పరిశోధకులు కనుగొన్నారు. ఫ్రెంచ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 2020 ఏప్రిల్ 1 మరియు ఆగస్టు 24 మధ్య సానిటైజర్‌లో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఎక్కువ కేసులను గుర్తించారు

Read more RELATED
Recommended to you

Latest news