పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత నాగరికమైన చర్య. ఐతే ఇద్దరు కలిసి చేయవలసిన ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా ఆ జీవితాలకి ఇబ్బందులు తప్పవు. అందుకే జీవిత భాగస్వామి ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
మీ కుటుంబంతో కలిసిపోయే వాళ్ళు ఉండాలి.
మీ జీవిత భాగస్వామి మీ కుటుంబంతో కలిసిపోవాలి. లేదంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు మీ భాగస్వామి కుటుంబంతో సరిగ్గా లేకపోతే, మీ భాగస్వామి కూడా మీ కుటుంబంతో కలవదు.
నవ్వించాలి
సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళు భాగస్వామిగా దొరకడం చాలా అదృష్టం. బాధల్లోనూ నవ్వించగల సత్తా వారికే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని దాటడానికి మీలో శక్తి కావాలంటే హాయిగా నవ్వండి.
మిమ్మల్ని గౌరవించే వాళ్లని ఎంచుకోండి.
మిమ్మల్ని సరిగ్గా గుర్తించలేని వారితో జీవితం పంచుకోవడం నరకం. మీరెంత పనిచేసినా మీ భాగస్వామి నుండి బాగుంది అన్న మాట రాకపోతే ఆ జీవితం వ్యర్ధ్యం. గుర్తించేవాళ్ళు మీ భాగస్వామే అయితే మీ జీవితం చాలా బాగుంటుంది.
మీ భాగస్వామికి ఇలాంటి లక్షణాలే ఉండాలని కోరుకోవద్దు. మీలో లేని లక్షణాలు వారిలో ఉండాలని అస్సలు అనుకోవద్దు. మీ జీవిత భాగస్వామిపై లేనిపోని అంచనాలు పెంచేసుకుని ఇబ్బంది పడవద్దు. ఈ ప్రపంచంలో పర్ ఫెక్ట్ మనుషులు ఎవరూ ఉండరు.
ఐతే ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయో లేదో తెలుసుకుంటే మీ మంచి భాగస్వామి అవుతారో లేదో తెలిసిపోతుంది.