డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ నైట్‌క్లబ్ పైకప్పు కూలింది. ఈ ఘటనలో 58కి పైగా మంది మృతి చెందారు. మరో 160 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని శాంటో డొమింగోలోస్థానికంగా ఉన్న జెట్ సెట్ నైట్‌క్లబ్‌లో వేడుక జరుగుతుండగా అకస్మాత్తుగా పైకప్పు కూలింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న బయటకు తీసి సమీప ఆస్పత్రి తరలించారు.
ప్రమాద సమయంలో పర్ఫామెన్స్ ఇస్తున్న రాంగే సింగర్ రూబీ పెరెజ్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ విషాదంపై తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు లూయిస్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాల సహాయక చర్యలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పైకప్పు కూలిన జెట్ సెట్ నైట్‌క్లబ్ వద్దకు వెళ్లిన లూయిస్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రజలకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు.