సార్.. హిందీ రాదు.. తెలుగులో మాట్లాడుతా.. ప్రధానితో ఏపీ మహిళా

-

ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రుణాల ద్వారా తాను ఎదిగిన తీరును ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. తనకు హిందీ రాదని, తెలుగులో మాట్లాడతానని ఆమె విజ్ఞప్తి చేయడంతో ప్రధాని అందుకు అంగీకరించారు. దాంతో ఆమె తన నేపథ్యాన్ని వివరించారు. “నాకు 2009లో పెళ్లయింది. 2019 వరకు గృహిణిగా. ఉన్నాను. కెనరా బ్యాంక్ రీజినల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్లో జనపనార (జూట్) బ్యాగ్ ల తయారీపై నేను 13 రోజులు శిక్షణ తీసుకున్నాను.

ఆ తర్వాత కెనరా బ్యాంకు వాళ్లే ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల ముద్రా రుణం ఇచ్చారు. 2019 నవంబరులో వ్యాపారం మొదలుపెట్టాను. నా చెల్లింపులు బాగా ఉండటాన్ని చూసి బ్యాంకు 2022లో రూ.9.5 లక్షల రుణం ఇచ్చింది. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. అందరు గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో శిక్షణ పొందిన వారే. అందరూ గృహిణులే. ఒకప్పుడు అక్కడే శిక్షణ పొందిన నేను ఇప్పుడు నాలాంటి మహిళలకు బోధిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటాను” అని ఆ మహిళ పేర్కొన్నారు. ఆమె ఎదుగుదలను ప్రధాని మోడీ అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news