షాకింగ్;160 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం…!

-

ఎవరు ఎన్ని చెప్పినా సరే మనిషి జీవితం కరోనా తర్వాత కరోనా ముందు అనేది వాస్తవం. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం బయటకు రావడం అనేది ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కంపెనీలు ఎన్నో భారీగా నష్టపోతున్నాయి. లాక్ డౌన్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయి ప్రభుత్వాలు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు.

ఇక కరోనా కారణంగా భారీగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఒక సంచలన నివేదిక బయటకు వచ్చింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(I.L.O) చెప్తున్న లెక్కల ప్రకారం చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎల్‌వో తాజాగా వేసిన అంచనాల ప్రకారం అసంఘటిత రంగంలో 160 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని లెక్కలతో సహా వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్‌తో చూస్తే ఈ సంఖ్య సగం అని పేర్కొంది. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్, మధ్య ఆసియాలో ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనే 30 కోట్ల మంది ఫుల్ టైం జాబ్స్ పోతాయని సంచలన విషయం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 43.6 కోట్ల చిన్న, పెద్ద కంపెనీలు మూతపడే అవకాశం ఉందని తన నివేదికలో వెల్లడించింది.

అందులో 23.2 కోట్ల హోల్ సేల్, 11.1 కోట్ల రిటైల్ పరిశ్రమలు ఉన్నాయని, ఫుడ్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రంగాలపైనా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. రెండో త్రైమాసికాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయొచ్చని వివరించింది. అన్ని రంగాలు కుదుటపడ్డాకే లేబర్ డిమాండ్, జాబ్స్ ఉనికిలో ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news