అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను ఏకాంతంగా గడిపానని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారని ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు.
ఈ సందర్భంగా ట్రంప్‌ను తానెలా కలిసిందీ.. ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందీ తదితర వివరాలను కోర్టులోని జ్యూరీ సభ్యులకు తెలిపారు.
2006లో ఓ గోల్ఫ్ టోర్నమెంట్‌తో తొలిసారి ట్రంప్‌ను కలిశానని.. ఆయన బాడీగార్డ్ ద్వారా డిన్నర్‌కు ఆహ్వానించారని స్టార్మీ తెలిపారు. అలా హోటల్ గదికి వెళ్లిన తాను ట్రంప్తో ఏకాంతంగా గడిపినట్లు చెప్పారు. ట్రంప్‌తో సంభోగాన్ని బయటపెట్టకుండా ఉండేదుకు 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ నుంచి స్వీకరించానని తన వాంగ్మూలంలో స్టార్మీ పేర్కొన్నారు. ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.