నాలుగో డోసు తీసుకున్నా.. త‌ప్పించుకోలేం : ఇజ్రాయిల్ శాస్త్రవేత్త‌లు

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ ప్ర‌భావం ఎక్కువ గానే ఉంది. ఓమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన త‌ర్వాత బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌న్న ప్ర‌తి పాధ‌న ముందుకు వ‌చ్చిది. అయితే ఓమిక్రాన్ వేరియంట్ విష‌యంలో ఇజ్రాయిల్ శాస్త్రవేత్త‌లు బాంబ్ పెల్చారు. నాలుగో డోసు వ్యాక్సిన్ తీసుకున్నా.. ఓమిక్రాన్ నుంచి త‌ప్పించుకోలేమ‌ని ఇజ్రాయిల్ శాస్త్రవేత్త‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశంలో కొంత మందికి నాలుగో డోసు వ్యాక్సిన్ వేసి ప‌రీక్షించామ‌ని తెలిపారు. నాలుగో డోసు తీసుకున్న వారిలో యాంటీ బాడీల స్వ‌ల్పంగానే పెరిగిన‌ట్లు గుర్తించామ‌ని అన్నారు.

ఈ యాంటీ బాడీలు ఓమిక్రాన్ ను ఎదుర్కొవ‌డానికి స‌రిపోవ‌ని తెల్చి చెప్పారు. దీంతో నాలుగో డోసు వ్యాక్సిన్ తీసుకున్నా.. ఓమిక్రాన్ నుంచి పూర్తి ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇజ్రాయిల్ కు చెందిన షెబా మెడిక‌ల్ సెంట‌ర్ శాస్త్రవేత్తలు ఈ ప్ర‌యోగం చేశారు. 154 మందికి ఫైజ‌ర్, 120 మందికి మోడార్నా టీకాల‌ను నాలుగో డోసు ఇచ్చి ప‌రీక్షించారు. రెండు వారాల త‌ర్వాత చూస్తే.. యాంటీ బాడీల సంఖ్య అశించిన స్థాయిలో పెర‌గ‌లేద‌ని తెలిపారు. పైగా మూడో డోసు తీసుకున్న వారిలో కంటే.. నాలుగో డోసు తీసుకున్న వారిలోనే త‌క్కువ యాంటీ బాడీలు వృద్ధీ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో మూడో డోసు గానీ, నాలుగో డోసు గానీ తీసుకున్నా.. క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news