ట్విటర్​కు తాలిబన్ల అభినందనలు.. ఆ రెండింట్లో భేష్ అంటూ

-

ప్రముఖ సోషల్ నెట్​వర్కింగ్ బ్లాగ్ ట్విటర్​కు అనూహ్య వ్యక్తుల నుంచి ప్రశంసలు లభించాయి. అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు ట్విటర్​పై ప్రశంసల జల్లు కురిపించారు. వాక్‌ స్వేచ్ఛ, విశ్వసనీయత విషయంలో ఇతర సామాజిక మాధ్యమాల కంటే ట్విటర్‌ ముందుందని తెగ పొగిడేశారు . తాలిబన్లలోనే అత్యంత క్రూరమైన వర్గంగా పేరున్న హక్కానీ నెట్‌వర్క్‌ అధినేత అనస్‌ హక్కానీ ఈ విషయాన్ని పేర్కొన్నారు.

‘‘ఇతర సోషల్‌ మీడియా వేదికలతో పోలిస్తే ట్విటర్‌ రెండు అంశాల్లో ముందుంది. వీటిల్లో మొదటిది వాక్‌ స్వేచ్ఛ. రెండో అంశం పారదర్శకత.. విశ్వసనీయత. మెటా మాదిరిగా అసహనపు విధానాలను పాటించదు. ట్విటర్‌ను మరో వేదిక భర్తీ చేయలేదు’’ అని అనస్‌ హక్కానీ ట్విట్‌ చేశారు.

మరోవైపు ట్విటర్‌కు పోటీగా ఇటీవలే మెటా థ్రెడ్స్‌ యాప్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల్లోనే థ్రెడ్స్‌ 10 కోట్ల లాగిన్లను సొంతం చేసుకొంది. తమ మేధో హక్కులను వాడుకొని ఈ యాప్‌ చేశారని మస్క్‌ నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news