ప్రముఖ సోసల్ మీడియా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాలిబన్లను సపోర్ట్ చేసే అకౌంట్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఇందుకు గాను ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఫేస్‌బుక్ నియమించింది. వారు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ తాలిబన్లకు సపోర్ట్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటారు. వారిని బ్యాన్ చేస్తారు.
కాగా గత ఎన్నో ఏళ్ల నుంచి తాలిబన్లు మెసేజ్ లను పంపుకునేందుకు సోషల్ మీడియానే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌కు చెందిన ఓ ప్రతినిధి బీబీసీ సంస్థతో మాట్లాడుతూ.. అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్ అనే సంస్థను టెర్రరిస్టు సంస్థగా గుర్తించామన్నారు. అత్యంత ప్రమాదకరమైన పాలసీలను ఆ సంస్థ కలిగి ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్లను సపోర్ట్ చేసే అకౌంట్లను బ్యాన్ చేస్తున్నట్లు వివరించారు.
కేవలం ఫేస్‌బుక్ మాత్రమే కాకుండా ఆ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యాప్ లకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందని తెలిపారు. అయితే తాలిబన్లు ఎక్కువగా వాట్సాప్‌ను కమ్యూనికేషన్ కోసం వాడుతున్నట్లు తెలిసింది.