టెలిగ్రామ్‌ ఫౌండర్‌ పావెల్‌ దురోవ్‌ అరెస్టు

-

టెలిగ్రామ్‌.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇదో సంచలనం. కేవలం చాటింగ్ కోసమే కాకుండా అన్నిరకాల సమాచారాన్ని ఇందులో పొందొచ్చు. ఏదైనా సినిమా చూడాలనుకుంటే.. ఆ పేరుతో వెతికితే చాలు.. ఆ సినిమా అందుబాటులో ఉన్న వందల గ్రూపులు మనకు కనిపిస్తాయి. వాటిలో చేరితే ఆ మూవీ లింక్ మీకు మెసేజ్ వస్తుంది. ఇలా దేనికి సంబంధించిన సమాచారాన్నైనా క్షణాల్లో పొందొచ్చు. అయితే ఈ టెలిగ్రామ్లో కొంతమంది అసాంఘీక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ ఫౌండర్‌, సీఈవో పావెల్‌ దురోవ్‌ను పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను పారిస్లో కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై గతంలో అరెస్టు వారెంట్‌ జారీ చేసిన అధికారులు.. తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ.. పావెల్‌ దురోవ్‌ పారిస్‌కు రావడంపై అధికారులు షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version