పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో ప్రావిన్స్ లో గుర్తు తెలియని ఉగ్రవాదుల చేతిలో 9 మంది బస్సు ప్రయాణికులతో సహా 11 మంది మరణించారని అధికారులు తెలిపారు. మొదటి సంఘటనలో, సాయుధ వ్యక్తులు ఏప్రిల్ 12న నోష్కి జిల్లాలో హైవే పై బస్సును ఆపి, తుపాకితో తొమ్మిది మందిని కిడ్నాప్ చేశారని పోలీసులు వెల్లడించారు.
తొమ్మిది మంది మృతదేహాలు ఆ తరువాత ఓ వంతెన సమీపంలోని పర్వత ప్రాంతాల్లో బుల్లెట్ గాయాలతో కనుగొన్నట్టు ఓ అధికారి తెలిపారు. బస్సు క్వెట్టా నుంచి తప్తాన్ కి వెళ్తుండగా.. సాయుధ వ్యక్తులు దానిని ఆపారు. ప్రయానికులను గుర్తించిన తరువాత తొమ్మిది మంది వ్యక్తులను పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారని తెలిపారు. మరో ఘటనలో అదే రహదారిపై కారుపై కాల్పులు జరిగాయి. ఇద్దరూ ప్రయాణికులు మరణించారు. మరో ఇద్దరూ గాయపడ్డారు. నోష్కీ హైవే పై 11 మందిని హతమార్చిన ఉగ్రవాదులను క్షమించబోమన్నారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంబడిస్తామని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి బుగ్తీ పేర్కొన్నారు.