అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ త్రీ వీలర్ ను విడుదల చేసింది. దీన్ని నడపడానికి ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేదని పేర్కొంది. ఆప్టెరా మోటార్స్ మొట్టమొదటి సౌర ఎలక్ట్రిక్ వాహనాన్ని (ఎస్ఇవి) ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. దీని రోజువారీ వినియోగానికి ఛార్జింగ్ అవసరం లేదు అని పేర్కొంది. పూర్తిగా చార్జ్ అయితే 1,600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్తుంది.
టెస్లా కార్లు ప్రస్తుతం అందించే వాటికంటే ఇది చాలా ఎక్కువ. సూర్య శక్తితో మాత్రమే ఇవి వెళ్తాయి అని బ్యాకప్ అవసరం లేదని పేర్కొన్నారు. డైరెక్ట్ కరెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 11,000 మైళ్ళకు పైగా ప్రయాణం చేయవచ్చు అని పేర్కొంది. డ్రైవింగ్ అలవాట్లను బట్టి ఈ కారుని మార్చుకోవచ్చు అని సంస్థ ప్రకటన చేసింది.