గత కొన్ని రోజులుగా కరోనాతో ఇబ్బంది పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చిందని వైట్ హౌస్ ప్రకటన చేసింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లోని ఒక విమానాశ్రయంలో ట్రంప్ సోఅమవారం ఎన్నికల ర్యాలీ మొదలు పెట్టే అవకాశం ఉంది.
నవంబర్ 3న అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. సైనిక ఆసుపత్రిలో మూడు రోజులు గడిపిన ట్రంప్ అక్టోబర్ 2 న వైరస్ బారిన పడ్డారని వైట్ హౌస్ ప్రకటించింది. కరోనాతో ఉన్నా సరే ట్రంప్ ఎన్నికల ప్రచారం చేసారు. మాస్క్ తీసేసి మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఆయన ఫోజులు ఇవ్వడం వివాదాస్పదం అయింది. ఇప్పుడు ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.