మారు పేరుతో ట్విట్టర్ లోకి ట్రంప్ రీ-ఎంట్రీ..మళ్లీ నిషేధం విధించిన ట్విట్టర్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ట్విట్టర్ నుంచి షాక్ తిన్నారు. ఇదివరకే 2021లో తనపై నిషేధం విధిస్తే.. మళ్లీ ఆయన (ట్విట్టర్ హ్యాండిల్) పేరు మార్చుకొని ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే కేవలం రోజుల వ్యవధిలోనే ట్రంప్ రీ ఎంట్రీ ని గుర్తించిన ట్విట్టర్ మరోమారు ఆయనకు నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన హఫ్ పోస్ట్ అనే మీడియా సంస్థ ఈ దిశగా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత ట్విట్టర్ వేదికగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్ అమెరికా రాజధాని పై దాడికి దిగేలా చేశారన్న ఆరోపణలతో 2021 లో ఆయనను ట్విటర్ నిషేధించింది. అయితే తన భావాలను వ్యక్తీకరించడానికి ట్విట్టర్ కు పోటీగా ట్రూత్ సోషల్ పేరిట ట్రంప్ వేరే వేదికను ప్రారంభించారు. దీనిద్వారా ఇప్పటిదాకా ట్రంపు తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే తాజాగా @PresTrumpTS పేరిట ఓ ట్విటర్ ఖాతాను తెరిచిన ట్రంప్.. ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేస్తున్న విషయాలన్నిటినీ ట్విట్టర్ లోనూ పోస్ట్ చేస్తూ వస్తున్నారట.

దీనిని గుర్తించిన మరుక్షణమే ఈ ఖాతాను కూడా నిషేధిస్తూ ట్విటర్ వేగంగా స్పందించింది. రెండు రోజుల క్రితం ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ చేసిన అంశాల్లో 21 అంశాలు ట్విట్టర్లోనూ కనిపించాయట. అంతేకాకుండా ట్వీట్లకు ‘ప్లీజ్ ఫాలో అండ్ రీ ట్వీట్ ‘ అంటూ ట్రంప్ రిక్వెస్ట్ లు కూడా పోస్ట్ చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news