కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్ వాలంటీర్ గా ప్రధాని…!

యుఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం కోవిడ్ -19 వ్యాక్సిన్ టీకా షాట్ తీసుకున్నారు. షేక్ మొహమ్మద్ తనకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నట్లు ట్విట్టర్‌ లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసారు. “ఈ రోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ అందుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ భద్రత మరియు గొప్ప ఆరోగ్యాన్ని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. మరియు యుఎఈలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మా బృందాలను చూసి గర్వంగా ఉంది అని ఆయన వివరించారు.

గత కొన్ని వారాలుగా అనేక మంది యుఎఇ మంత్రులు కూడా ఈ టీకాను తీసుకున్నారు. కోవిడ్ -19 రోగులతో సన్నిహితంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలను రక్షించడానికి మరియు వారి భద్రత కోసం దేశం తీసుకున్న చర్యలలో భాగంగా టీకా అత్యవసర వాడకానికి యుఎఈ అనుమతులు ఇచ్చింది. చట్టాలలో కూడా స్వల్ప మార్పులు చేసారు.