యూకేలో ఇన్ఫోసిస్ కు ‘వీఐపీ ఎంట్రీ’.. సునాక్ సర్కార్ పై ప్రతిపక్షం విమర్శ

-

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సర్కార్పై ఆ దేశ ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. సునాక్ కుటుంబ సంస్థ కావడం వల్లే ఇన్ఫోసిస్‌కు బ్రిటన్‌లో ‘వీఐపీ ఎంట్రీ’ దక్కుతోందని ఆరోపించింది. ఆ సంస్థ బ్రిటన్‌లో ఎదగడానికి సాయం చేస్తామని వాణిజ్య మంత్రి లార్డ్‌ డొమినిక్‌ జాన్సన్‌ పేర్కొనడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది. బిలియన్ల కొద్దీ ప్రజల పన్ను డబ్బును ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ సొమ్ముతో రిషి సునాక్ బంధుత్వమున్న కంపెనీకి వీఐపీ ఎంట్రీ కల్పించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని లేబర్‌ పార్టీ షాడో మంత్రి జొనాథన్‌ యాష్‌వర్త్‌ మండిపడ్డారు. ఈ విషయంలో తలెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖండించారు. పెట్టుబడులశాఖ మంత్రి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో తరచూ సమావేశమవుతుంటారని బ్రిటన్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో భాగంగా ఈ భేటీలు జరుగుతుంటాయని తెలిపారు.. దీనివల్ల వేల ఉద్యోగాలొచ్చి బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news