మాస్కోను వణికించిన ఉక్రెయిన్‌.. దెబ్బకు దెబ్బతీస్తామంటూ రష్యా వార్నింగ్

-

ఉక్రెయిన్​-రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట్లో తడబడ్డ ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యాపై తీవ్రంగా విరుచుకు పడుతోంది. తాజాగా రష్యా వెన్నులో వణుకు పుట్టించేలా సోమవారం రోజున దాడి చేసింది. సోమవారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు ఏకంగా మాస్కో గగనతలంలోకే చొచ్చుకొచ్చాయి. ఓ డ్రోన్‌ రష్యా రక్షణమంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దూసుకొచ్చింది. కార్యాలయానికి కేవలం 200 మీటర్ల దూరంలో దాన్ని జామర్లతో రష్యా కూల్చివేసింది.

మరో డ్రోన్‌.. ఎత్తైన ఓ ప్రభుత్వ భవనం పై రెండంతస్తులకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ రెండు ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని రష్యా తెలిపింది. క్రిమియాలో ఆయుధ డిపోపైనా డ్రోన్లు దాడి చేయడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ డ్రోన్ల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకు దెబ్బ తీస్తామని రష్యా తీవ్రంగా ఉక్రెయిన్​కు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దక్షిణ ఉక్రెయిన్‌లోని నల్లసముద్రతీర పట్టణాలపై మాస్కో దాడులు సోమవారమూ కొనసాగాయి. ముఖ్యంగా డాన్యూబ్‌ నది పక్కన ఉన్న ఓడరేవులను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించింది.

Read more RELATED
Recommended to you

Latest news