జెలెన్‌స్కీ ఇంటి ముందు ‘నాటు-నాటు’.. ఉక్రెయిన్ సైనికుల డ్యాన్స్ అదుర్స్

-

ఆర్ఆర్ఆర్.. సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఈ పాట ఆస్కార్​ గెలుచుకుందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా చర్చ నాటు నాటు పాట గురించే.. అందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు అందరూ చిందులేశారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ ఈ పాటకు స్టెప్పులు వేయాల్సిందే అన్నంతలా మారిపోయింది.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన జీ20 సదస్సు వేదికపైనా ఈ పాటకు స్టెప్పు లేశారు. అయితే ఈ ఒరిజినల్‌ సాంగ్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికారిక నివాసం ఎదుట ఆగస్టు 2021లో చిత్రీకరించారు. తాజాగా ఇప్పుడు అదే చోట ఈ సాంగ్‌పై ఉక్రెయిన్‌ సైనికులు డ్యాన్స్ చేశారు. దాదాపుగా అవే స్టెప్పులతో అదరగొట్టారు. అయితే వీరు తమపై దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా పాటను చిత్రీకరించారు. పాటలో సైనికులు డ్రోన్స్‌ ఎగురవేస్తున్నట్లు కనిపించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news