ఉక్రెయిన్​ సంక్షోభం.. ఊళ్లను ముంచెత్తిన కఖోవ్కా డ్యామ్​ నీరు

-

ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం ఆ దేశానికి తీవ్రముప్పు కలిగిస్తోంది. ఏడాదికిపైగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉక్రెయిన్​కు మరో పెను ప్రమాదం తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆ దేశానికి గుండెకాయ వంటి కఖోవ్కా ఆనకట్ట పేలిపోయింది. అనేక ప్రాంతాలకు నీరందించే కఖోవ్కా ఆనకట్ట ధ్వంసం కావడం వల్ల.. పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో వందల కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డ్యామ్‌ కూల్చివేతతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమలు, మొక్కజొన్న రేట్లు ఆకాశాన్నంటాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించే కఖోవ్కా ఆనకట్ట ధ్వంసం కావడం వల్ల పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది. కఖోవ్కా జలాశయం నుంచి భారీగా నీరు దిగువకు వస్తుంన్నందున ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ఆనకట్ట కుడివైపున ఉన్న10 గ్రామాలు, ఖేర్సన్ నగరంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సహాయ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news