మానసిక కుంగుబాటు ఏమో అని సందేహమా..? ఇవే సంకేతాలు..!

-

చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యల వలన ఎంతగానో ఇబ్బంది పడాలి మీరు కూడా మానసిక కొంగుబాటుకి గురయ్యారా..? అయితే ఇవే సంకేతాలు ఇవి కనుక ఉన్నట్లయితే కచ్చితంగా మీరు కూడా ఏదో సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం. చాలామందిలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆందోళన ఫెయిల్యూర్ ఒత్తిడి ఇలా.. అయితే ఇలాంటి వాటి నుండి బయటపడలేక చాలా మంది ఆత్మహత్య ఏ సమాధానం అని అనుకుంటారు.

depression1

ఇలాంటి వారిలో ఈ లక్షణాలు ఉంటాయి చూసుకోండి. మానసికంగా కుంగుబాటు కి గురైన వారిలో మూడు స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి. వెంటవెంటనే మారుతూ ఉంటాయి. విభిన్న ఎమోషన్స్ ని చూపిస్తూ వుంటారు. మానసిక అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఎక్కువగా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది అలాంటివారు కౌన్సిలింగ్ కి వెళ్లడం, థెరపీలు వంటివి చేయించుకోవడం మంచిది అప్పుడు సమస్య నుండి బయట పడొచ్చు రిలేషన్ షిప్ లో తరచూ గొడవలు ఉన్నవారు ఎక్కువగా మానసిక ఒత్తిడి కి గురవుతూ ఉంటారు.

జీవితం మీద ఆశని కూడా కోల్పోతూ ఉంటారు. ఇష్టమైన వాళ్ళు దూరమైనా లేకపోతే ప్రమాదకరమైన వ్యాధి ఉన్నట్లు తెలిసిన కూడా ఈ సమస్య ఉంటుంది కొంతమంది మానసికంగా వీక్ గా ఉంటారు అలాంటి వారిలో మార్పులు కనపడతాయి. ఆటిట్యూడ్ బిహేవియర్లో మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొంత మంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు.

బ్రేకప్ అయినా లేకపోతే ఏదైనా జరిగిన అలాంటప్పుడు కూడా కుంగుబాటుకి గురవుతూ ఉంటారు. మానసికంగా కృంగిపోయిన వాళ్లలో కోపం ఎక్కువగా ఉంటుంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కువ ఆల్కాహాల్, సిగరెట్, డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. మానసికంగా ఒత్తిడిగా అనిపించిన డిప్రెషన్ సమస్యలు కనిపించినా కౌన్సిలర్ ని సంప్రదించండి అప్పుడు ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news