అప్పటి వరకు వర్క్ ఫ్రం హోమ్ అంటున్న అమెజాన్…!

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానాటికి భారతదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వెళుతుంది. ఈ పరిస్థితుల నడుమ దిగ్గజ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్ సంస్థ వారి ఉద్యోగుల ఆరోగ్య దృష్ట్యా వర్క్ ఫ్రొం హోమ్ అవకాశాన్ని వచ్చే సంవత్సరం జనవరి నెల 8వ తారీఖు వరకు పొడిగించింది. అయితే ఇది వరకు మే నెలలో అమెజాన్ వారి ఉద్యోగులను అక్టోబర్ 2 వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయవచ్చని తెలపగా, తాజాగా ఆ గడువును జనవరి 8, 2021 కి మార్చింది.

amazon
amazon

ప్రపంచం మొత్తంగా ఉన్నకరోనా కేసులు దృష్ట్యా సెప్టెంబర్ నెలలో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావించిన అమెజాన్ సంస్థ వారి ఉద్యోగుల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అమెజాన్ సంస్థ ఉద్యోగులు రాబోయే జనవరి 8వ తారీఖు వరకు ఇంటి నుండి పని చేస్తే సరిపోతుంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కార్యాలయాలన్నిటికి ఈ విధానం వర్తిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news