అభిమానుల కోసం “బిగ్ బీ” స్పెషల్ పోస్ట్..!

క‌రోనా బారిన ప‌డిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా తన అభిమానుల కోసం స్పెష‌ల్ పోస్ట్ పెట్టారు. 6 రకాల వ్యక్తుల నుండి దూరంగా ఉండమని కోరారు. “అసూయ, అయిష్టత, అసంతృప్తి, కోపం, ఇతరులపై అనుమానం, ఇతరులపై ఆధారపడి జీవించడం వంటి అలవాట్లు ఉన్న వారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అందుకే మనం ఈ లక్షణాలు ఉండే వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి” అంటూ బిగ్‌ బీ ట్వీట్ చేశారు. ఆయన సందేశాలను  అభిమానులు కూడా స్పందిస్తున్నారు..

View this post on Instagram

*ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः।* *परभाग्योपजीवी च षडेते दुखभागिनः।।* *अर्थात-* सभी से ईर्ष्या करने वाले, घृणा करने वाले, असंतोषी, क्रोधी, सदा संदेह करने वाले और पराये आसरे जीने वाले ये छः प्रकार के मनुष्य हमेशा दुखी रहते हैं। अतः यथा संभव इन प्रवृत्तियों से बचना चाहिए। They that express jealousy always towards others, they who ever dislike all others, they that remain dissatisfied, angered , they that are always and ever doubting .. and those who live off others .. these 6 kinds of individuals shall remain ever filled with sadness .. whenever possible we need to save ourselves from such trend setters ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

త్వరగా కోలుకుని.. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవాలని ప్రార్ధిస్తున్నామని బిగ్ బీ అభిమానులు పేర్కొన్నారు. కాగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే..అయితే.. అమితాబ్ తో పాటు.. అభిషేక్ బచ్చన్ కు, ఐశ్వర్య కు.. కూతురు ఆరాధ్య కు కూడా కరోనా సోకింది.. వీరు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.. అమితాబ్ కూడా ముంబైలోని నానావతి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..