నౌక ఢీకొని కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు

-

అమెరికాలో భారీ ప్రమాదం జరిగింది. బాల్టిమోర్‌లో ఓ కంటెయినర్‌ ఓడ.. నదిలో స్టీల్‌ వంతెనను ఢీ కొట్టగా బ్రిడ్జి పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వంతెనపై ప్రయాణిస్తున్న కార్లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్లు సమాచారం. అమెరికాలోని బాల్టిమోర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

పటాప్‌స్కో నదిలోబాల్టిమోర్‌ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతున్న కంటెయినర్ ఓడ, మార్గమధ్యలో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ వంతెనను ఢీ కొట్టింది. నదిలో పడిన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. కార్లలో గల్లంతైన వారు కచ్చితంగా ఎంతమందో తెలియదని చెప్పిన అగ్నిమాపక సిబ్బంది మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వంతెన కూలిపోవడం వల్ల బాల్టిమోర్‌ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించగా, అధికారులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

మరోవైపు ఈ ఘటనలో షిప్‌లో ఉన్న భారతీయ సిబ్బంది అంతా క్షేమమని షిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా అందరిని గుర్తించినట్లు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news