రఫాలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన అమెరికా

-

ఎంత చెప్పినా వినకుండా రఫాలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు పంపాల్సిన కీలక ఆయుధాల సరఫరాను నిలిపేసింది. ఒక్కోటీ 900 కేజీల బరువుండే 1,800 బాంబులు, 226 కేజీల బరువుండే మరో 1,700 బాంబులను అమెరికా ఆపేసింది. బైడెన్‌ అధికార యంత్రాంగంలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

రఫాలో పౌరులభద్రత, మానవీయ సాయంపై అమెరికా ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ దాడులకు దిగిన విషయం తెలిసిందే. గాజాలో విధ్వంసం కారణంగా రఫాలో దాదాపు 10 లక్షల మందికిపైగా పాలస్తీనా పౌరులు తలదాచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ రఫాలో వాడే అవకాశమున్న ఆయుధాల ఎగుమతిపై పునఃసమీక్షిస్తున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకారం తెలిపినా రఫాపై దాడిని కొనసాగించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా యుద్ధ ట్యాంకులను, సైన్యాన్ని రఫా వద్దకు పంపి దాడులు చేస్తోంది. రఫా నుంచి ఈజిప్టులోకి ప్రవేశించే మార్గాన్ని సీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news