కరోనా వైరస్ ను దాని వేరియంట్లను ఎదుర్కోవడానికి మరో వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చింది. అమెరికా కు చెందిన సంస్థ తయారు చేసిన నొవావాక్స్ అనే వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. నొవావాక్స్ టీకా కు అత్యవసర అనుమతి ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను అమెరికా కోరింది. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నొవావాక్స్ టీకా కు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. కాగ ఈ నొవావాక్స్ నే మన దేశంలో కొవావాక్స్ అనే పేరు తో భారత సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది.
అలాగే దీని పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. కరోనా కొత్త వేరియంట్లను నియంత్రించడానికి నొవావాక్స్ సమర్థవంతం గా పని చేస్తుందని అన్నారు. అలాగే ప్రపంచం లో చాలా దేశాలలో పౌరులు వ్యాక్సిన్ లు తీసుకోలేదని అన్నారు. తక్కువ ఆదాయం గల 41 దేశాల్లో కనీసం ఇప్పటి వరకు 10 మంది కూడా వ్యాక్సిన్ లు తీసుకోలేదని అన్నారు. వారి కోసం వ్యాక్సిన్ లను వినియోగించాలని సూచించారు. అలాగే ఈ టీకా 90 శాతం సమర్థత కలిగి ఉందని తెలిపారు.