అమ‌రావ‌తికి సీఎం జ‌గ‌న్ వ్య‌తిరేకం కాదు : ఎంపీ ర‌ఘురామ‌

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి సీఎం జ‌గ‌న్ వ్య‌తిరేకం కాద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు అన్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఏనాడూ అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదని అన్నారు. కానీ సీఎం జ‌గ‌న్ చుట్టూ ఉండే మంత్రులే ఆలా ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. మంత్రుల కే అమ‌రావ‌తి ఇష్టం లేద‌ని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంద‌ని అందుకే ఆంధ్ర ప్ర‌దేశ్ లో రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని పార్ల‌మెంట్ లో కోరాన‌ని అన్నారు. తానే చెప్పిన విష‌యాల‌ను దాదాపు అలాగే త‌మ వైసీపీ పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్ లో ప్రస్తావించార‌ని తెలిపారు.

కాగ అమ‌రావ‌తి కోసం ఆందోళ‌న న్యాయస్థానం టూ దేవస్థానం సక్సెస్ అయిందని అన్నారు. త‌మ ముఖ్యమంత్రి కూడా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని అన్నారు. మళ్లీ బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ లో కూడా బిల్ పాస్ కావాలని తెలిపారు. అయితే అమిత్ షా తిరుపతిలో అడుగు పెట్టగానే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారని అన్నారు. అమ‌రావ‌తి విష‌యంలో స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం స్టేక్ హోల్టర్స్ అయిన రైతులతో ఎందుకు మాట్లాడలేదని అన్నారు. అలాగే త‌ను తిరుపతిలో అడుగు పెడితే ఏదో చేస్తారని రిపోర్ట్ అందిందని అన్నారు. కానీ పోలీసుల స‌హాయం తో తిరుప‌తికి చేరాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news