కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గత మూడేళ్లు ఏ విధంగా గడగడలాడించిందో అందరికీ తెలిసిందే. మూడు విడతల్లో ప్రజల ప్రాణాలు బలితీసుకుంది. కరోనా బారిన పడిన వారంతా ఇప్పటికీ పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక ఇటీవలే మరోసారి కొవిడ్ మహమ్మారి జడలు విప్పి మళ్లీ దూకుడు పెంచింది. త్వరగా అప్రమత్తం కావడంతో కాస్త తగ్గుముఖం పట్టింది.
ఇక ఇప్పుడిప్పుడే హాయిగా గాలి పీల్చుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అథనమ్ గెబ్రియాసిస్ చేసిన హెచ్చరికలు మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరో మహమ్మారిని ఎదుర్కొనేందకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ భయం పుట్టిస్తున్నాయి. రాబోయే మహహ్మరి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని గెబ్రియాసిస్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్-19 హెల్త్ ఎమర్జన్సీ ముగింపుతో .. కొవిడ్ ఆరోగ్య సంక్షోభం ముగిసిపోలేదని అన్నారు. కరోనాకు చెందిన ఏదో ఒక కొత్త వేరియంట్ కొత్త వ్యాధులను సృష్టిస్తుందని, దాని వల్ల కలిగే ప్యాథోజన్లతో మరింత ప్రమాదరకర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని టెడ్రోస్ అన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ రిపోర్టును ప్రజెంట్ చేశారు.