వేసవిలో ఇలా ఉందా..? అయితే అది డీహైడ్రేషన్ ఏ..!

-

డీహైడ్రేషన్: వేసవి కాలంలో ఎక్కువ మందిలో డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది అలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడ్డామా లేదా అనే సందేహం ఉన్నట్లయితే ఇలా క్లియర్ చేసుకోవచ్చు. మన బాడీలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ కలుగుతుంది డిహైడ్రేషన్ కారణంగా తలనొప్పి అలసట కిడ్నీ సమస్యలు వంటివి కలుగుతూ ఉంటాయి. డిహైడ్రేషన్ కి గురైనప్పుడు కొన్ని సంకేతాలు కనబడతాయి. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం…

మీకు బాగా దాహం వేస్తున్నట్లయితే అది కచ్చితంగా డిహైడ్రేషన్ అని చెప్పొచ్చు. శరీరానికి కావాల్సిన నీళ్లు లేవని దానికి అర్థం అందుకని తగినంత నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. మూత్రం ముదురు రంగులో వస్తుంటే కూడా అది డిహైడ్రేషన్ అని మనం తెలుసుకోవచ్చు. డిహైడ్రేషన్ సమస్య ఉన్నట్లయితే వెంటనే నీళ్లు తీసుకోవడం ముఖ్యం. మూత్రం పసుపు ముదురు కాషాయ రంగులో వస్తుంది అప్పుడు కచ్చితంగా ఎక్కువ నీళ్లు తీసుకోండి.

అలసటగా ఉంటే కూడా డిహైడ్రేషన్ సమస్య అని చెప్పొచ్చు బలహీనంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. నీరసంగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. వేసవికాలంలో తలనొప్పి మైగ్రేన్ కూడా ఎక్కువగా వస్తుంది బాడీలో నీరు తక్కువ అవడం వలన ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం అవసరం డిహైడ్రేషన్ వలన తల తిరుగుతూ ఉంటుంది కళ్ళు తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది. నోరు పొడి బారిపోతుంది కూడా. నోరు తరుచు ఆరిపోతుంటే కూడా డిహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు. అప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి చర్మం పొడిగా అయిపోయినట్లయితే కూడా అది డిహైడ్రేషన్ అని చెప్పొచ్చు. తగినన్ని నీళ్లు తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news