Pakistan : పాకిస్థాన్​లో వికీపీడియా బ్యాన్​

-

పాకిస్థాన్​లో వికీపీడియాను నిషేధించింది ఆ దేశ టెలికాం అథారిటీ. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించకపోవడం వల్ల వికీపీడియాపై వేటు పడినట్లు పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) అధికార ప్రతినిధి మలహత్ ఒబాద్​.. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. నిబంధనలను పాటించకపోవడం వల్లే వికీపీడియాను బ్యాన్ చేసినట్లు వెల్లడించారు. హైకోర్టు సూచన మేరకు వికీపీడియాకు యాక్సెస్ లేకుండా చేసినట్లు ​పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితమే వికీపీడియాను 48 గంటలపాటు యాక్సెస్ లేకుండా చేసి పాకిస్థాన్ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.

అంతకుముందు.. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని వికీపీడియాకు నోటీసు జారీ చేసినట్లు పీటీఏ అధికార ప్రతినిధి మలహత్​ తెలిపారు. అయితే వికీపీడియా కంటెంట్‌ను తొలగించగా పోగా.. వివరణ కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగిస్తే నిషేధం తొలగించే అంశంపై పునరాలోచిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news