ట్విట్టర్ ట్రెండింగ్‌లో మూడో ప్రపంచ యుద్ధం

-

మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల అనేక దేశాల ఆర్థిక పరిస్థితులు చిన్నభిన్నమైన సంగతి తెలిసిందే. ఇక ఆ కాలం నాటి ఆనవాళ్ళను మరువక ముందే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు నెలకొన్నాయి.మొన్నటి వరకు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే

తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కూడా దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా అండగా ఉంటామని బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ప్రపంచంలోని పెద్ద దేశాలు మద్దతుగా నిలుస్తుండగంతో సమస్య పెద్దగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ నిన్న రాత్రి ఇజ్రాయిల్ పై దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లా వైరల్‌గా మారాయి. దీంతో ఈ వీడియోలను షేర్ చేస్తున్న నెటిజన్లు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని.. దీంతో ప్రపంచం నాశనం కాబోతుందని ఎక్స్(ట్విట్టర్) లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా, సిరియా రాజధానిలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1 ఇజ్రాయెల్ దాడి చేసింది.దీంతో ఇరాన్‌కు చెందిన ఏడుగురు రివల్యూషనరీ గార్డ్‌లు చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడికి దిగింది.

Read more RELATED
Recommended to you

Latest news