రష్యా భూభాగాలను ఆక్రమించం : జెలెన్‌స్కీ

-

ఏడాదికిపైగా రష్యా, ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్​లోని పలు భూభాగాలను ఆక్రమించుకుంది. మరిన్ని ఆక్రమించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే .. రష్యా ఆక్రమించిన భూభాగాలను సాధించుకోవడమే లక్ష్యంగా తాము ఎదురుదాడి ప్రణాళికలను రచిస్తున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తాము రష్యా ప్రాంతాలపై కన్నేయలేదని తెలిపారు.

ఆదివారం రోజున జెలెన్‌స్కీ జర్మనీ చేరుకున్నారు. ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రష్యా భూభాగాలపై దాడి చేయం. మాకు చెందిన ప్రాంతాలనే విముక్తి చేసుకుంటాం. మాకు మాస్కోపై దాడి చేసే సమయమూ లేదు. అంత ఆయుధశక్తీ లేదు’’ అని పేర్కొన్నారు. రష్యా ప్రాంతాలను ఆక్రమించేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందని, తర్వాత శాంతి చర్చల్లో వాటిని బేరసారాలుకు వాడుకోనుందని వస్తున్న ఊహాగానాలు నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ వివరణ ఇచ్చారు.

మరోవైపు జర్మనీ నుంచి జెలెన్‌స్కీ ఆదివారం హఠాత్తుగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. రష్యా బలగాలపై ఎదురుదాడి చేయడం కోసం పాశ్చాత్యదేశాల మద్దతును కోరుతున్న ఉక్రెయిన్‌- ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ను అదనపు సైనిక సాయం అర్థించడానికే పారిస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news