మన భారత దేశం పుణ్య భూమి, ఖర్మ భూమి అని పిలవబడుతుంది. ఇక్కడ సమస్త దేవతలు సంచరిస్తూ ఉంటారని ప్రతీతి. ఇక్కడ గల ప్రజల జీవన శైలి, భక్తి భావాలకు నెలవు కనుక ధర్మం నాలుగు పాదాల పై నడుస్తుంది. కనుక దేవతలు సంతోషంగా మన గడ్డపై తిరుగుతారని ఒక నమ్మకం. దీనికి గాను ఎన్నో చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. అడుగడుగునా ఉన్న దేవాలయాలే దీనికి నిదర్శనం. తిరుమల వెంకటేశ్వర ఆలయం మన దేశంలోనే పేరు పొందిన దేవాలయం. అయితే తెలంగాణలో గల ఈ ఆలయం కూడా చాలా మందికి సుపరిచితమే.
తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం సంఘీ దేవాలయం. ఆనంద గిరి అనే కొండపై ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో అందమైన శిల్పకళతో అలరిస్తుంది. ఈ ఆలయాన్ని చోళ, చాళుక్యుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం కలిగి ఉంటుంది. ఇది 1991 వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శ్రీ దేవి, భు దేవి సహిత వెంకటేశ్వర స్వామీ వారు కొలువై ఉన్నారు. ఆకర్షిస్తుంది. దక్షిణ భారత దేశ పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం తల పెట్టిందని కథనం.
ఈ ఆలయం యొక్క మరొక విశేషం చీకటి పడగానే ఆలయం దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయ రాజ గోపురం 15 అడుగుల ఎత్తులో ఉండటం వలన సుదూర ప్రాంతాలకు కనపడుతుంది. రామోజీ ఫిలిం సిటీకి దగ్గరగా ఉన్నందున ఇక్కడ నిత్యం సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి. అందుకే అనేక సినిమాలలో కూడా ఈ ఆలయం కనపడుతుంది. ఇంకా ఇక్కడ దుర్గాదేవి, కార్తికేయ, వినాయక, రామ, శివుడు, కాలాంమ్బిక, ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి.