వైసీపీ ఎంపీకి ఢిల్లీలో కీలక పదవి..!

-

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎంపీ వల్లభనేని బాలసౌరి కి ఢిల్లీ లో కీలక పదవి వచ్చింది. పార్లమెంట్‌ క‌మిటీల్లో అత్యంత కీలకంగా భావించే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(ప్రజాపద్దుల సంఘం)లో ఆయన సభ్యుడిగా ఎంపిక అయ్యారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నియామకం జరిగిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న సీనియర్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటి చైర్ పర్సన్‌గా ఎంపిక అయ్యారు. ఈ కమిటీ లో ఆయన సేవలు అందిస్తారు. ప్రభుత్వ రెవెన్యూ,ఖర్చులను ఆడిట్ చేస్తుంది ఈ కమిటి. ముందు నుంచి కూడా విపక్షాలకు చెందిన వ్యక్తులకు ఈ పదవి ఇస్తూ ఉంటారు. రాష్ట్రాల్లో కూడా ఇదే ఉంటుంది.

పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి చెందిన ఎవరైనా ఎంపీని చైర్ పర్సన్ గా నియమిస్తారు. అదే కమిటిలో ఇతర పార్టీలకు చెందిన వారిని సభ్యులుగా ఉంచుతారు. లోక్సభలో పార్టీలకు ఉన్న బలం ఆధారంగా ఈ ఎంపిక చేపడతారు. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. కాగా ఏపీలో ఈ కమిటికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news