రెడ్ జోన్ లో క్రికెట్ ఆడారు… పోలీసులు తాట తీసారు…!

-

ఒక పక్క కరోనా విస్తరిస్తుంది… లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తున్నారు. అయినా సరే కొందరు మాత్రం మారడం లేదు. తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. బయటకు రావొద్దని పోలీసులు చెప్తున్నా సరే జనాలు మాత్రం మాట వినడం లేదు. చిన్న చిన్న అవసరాల కోసం బయటకు రావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కొందరు నైట్ క్రికెట్ ఆడి పోలీసులకు దొరికిపోయారు.

అది కూడా కేసులు ఎక్కువగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని జంగలేశ్వర్‌లో రాత్రి వేళ క్రికెట్ ప్లాన్ చేసారు కొందరు. మొత్తం 11 మంది యువకులు పగలు పోలీసులు ఉన్నారు కదా అని నైట్ ఆడుకోవాలి అని భావించారు. ఇక వారు అక్కడ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో లాక్డౌన్ ఉల్లంఘన నేరం కింద వారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పైగా అది కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. జంగలేశ్వర్‌లో 40 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీనితో అది రెడ్ జోన్ గా ఉంది. దీనిపై మాట్లాడిన భక్తినగర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ వి.కె.గాంధవి… జంగలేశ్వర్ కరోనా హాట్‌స్పాట్‌గా మారిందని అన్నారు. ఇక్కడ 40 కి పైగా కరోనా కేసులు ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారన్నారు. దీనిని పట్టించుకోకుండా కొందరు యువకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడారని అరెస్ట్ చేసామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news