అందాలతో కేక పుట్టించే కేతిక శర్మ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

-

కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు. కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు.. ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’. ఈ సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ తన అందచందాలతో రోజురోజుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడి గురించి కొన్ని విషయాలు మీ కోసం…

కేతిక శర్మ దిల్లున్న దిల్లీ అమ్మాయి. తెలుగు సినిమాలకోసం హైదరాబాద్‌ వచ్చేసింది. ప్రస్తుతం కొన్ని తమిళ ప్రాజెక్టులూ చేస్తోంది. ఈమె డాన్స్‌లో అదరగొడుతుంది. ఈమెకు కరాటే కూడా వచ్చు. పరిశ్రమలో అడుగు పెట్టకముందు తను సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.

కేతికకు డజన్లకొద్దీ అబ్బాయిలు ప్రపోజ్‌ చేశారట. కొంతమంది మోకాళ్లపై కూర్చొని, ఇంకొందరు చేతిలో ఎర్ర గులాబీ పట్టుకొని, ఖరీదైన బహుమతులిచ్చి.. ఎన్నెన్నో. సినిమా ఆఫర్లే ప్రాణం అనుకున్న అమ్మాయి కాబట్టి ప్రేమ ఆఫర్లన్నీ తిరస్కరించిందట.
ఇంట్లోవాళ్లతో కలిసి దిల్‌ తో పాగల్‌ హై చూస్తుండగా.. మనుషులు తెరమీద ఎలా కనిపిస్తారని చిత్రమైన సందేహం వచ్చిందట చిన్నారి కేతికకి. అప్పుడు సినిమాలు, తారలకుండే పేరు గురించి అమ్మ వివరించగానే.. పెద్దయ్యాక హీరోయిన్‌ అయిపోవాలని ఫిక్సయ్యిందట.

అమ్మానాన్నలు డాక్టర్లు. తను యాక్టర్‌ అవుతానంటే వెనక్కి లాగకుండా ‘గో.. అహెడ్‌’ అన్నారట. చదువైపోగానే ముంబయిలో వాలిపోయి, మోడల్‌గా కెరియర్‌ మొదలుపెట్టింది. ఒకట్రెండు ప్రకటనల్లో నటించాక ‘థగ్‌ లైఫ్‌’ పేరుతో ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో వదిలింది. అదో సంచలనం. అప్పటికే తను చేసిన కొన్ని డాన్స్‌ వీడియోలు బాగా పేరు తీసుకొచ్చాయి.

తొలి అవకాశం ఎలా వచ్చిందంటే.. యాక్టింగ్‌ నేర్చుకుంటుండగానే పూరి ఆఫీసు నుంచి పిలుపొచ్చింది. ముందు ప్రాంక్‌ కాల్‌ అనుకుంది. నిజమని తెలిశాక ఎగిరి గంతేసింది. అందులో ఓకే కాగానే ‘రొమాంటిక్‌’తో తెరంగేట్రం చేసింది. కేతిక మంచి స్విమ్మర్‌. దిల్లీ తరపున రాష్ట్రస్థాయిలో పాల్గొంది. తల్లే గురువు, శిక్షకురాలు. కేతికకు నచ్చే నటి సాయిపల్లవి, నటుడు ప్రభాస్. అభిమానించేది ఐశ్వర్యరాయ్‌. ఈమె ప్రస్తుతం ఇన్‌స్టా ఫాలోయర్లు 23 లక్షలు. నచ్చే హాలీడే స్పాట్‌ బ్యాంకాక్‌ అట. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news