దాని వల్లే సల్మాన్​కు అదృష్టం.. అది లేకుండా ఏ సినిమా చేయడట!

-

కండలవీరుడిగా గుర్తింపు పొందిన ఈ బాలీవుడ్‌ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గాడ్‌ఫాదర్‌’లో తెలుగు తెర మీదా మెరిసిన సల్లూ భాయ్‌…తన ఇష్టాయిష్టాలను చెబుతున్నాడిలా…

నలుపురంగు నచ్చుతుంది మొదటినుంచీ నాకు నలుపు రంగు అంటే ఇష్టం. అందుకే షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా షర్ట్స్‌, టీషర్ట్స్‌, కుర్తా… ఇలా అన్నీ నల్లటివే ఎక్కువగా కొంటుంటా. ఇంట్లోవాళ్లు మళ్లీ నలుపు రంగే తెచ్చుకున్నావెందుకని అడగకుండా అవన్నీ వందశాతం నలుపుకాదూ వాటి షేడ్స్‌ అంటూ చెప్పి నమ్మిస్తుంటా. అలా కొనుక్కున్నవాటిని సమయం సందర్భం అంటూ లేకుండా నాకు నచ్చినప్పుడల్లా వేసుకునేందుకు ఇష్టపడతా.

తెగ కొంటా ఎందుకో తెలియదు మరి.. నేను సబ్బుల్ని చూస్తే మాత్రం కొనకుండా ఆగలేను. ముఖ్యంగా సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారుచేసిన సబ్బులు కనిపించాయంటే వాటిల్లో అన్నిరకాల ఫ్లేవర్లనీ కొనేసి నా బాత్రూంలో పెట్టేస్తుంటా. అలా నా బాత్రూంలో నిండిపోయిన సబ్బుల్లో ఇంకా వాడనివి ఎన్నో ఉన్నాయి.

అప్పుడు అభిమానులతో మాట్లాడతా ఓ నటుడిగా నేనూ చాలా వైఫల్యాలు ఎదుర్కొన్నా. నిజానికి వాటిని తట్టుకోవడం కష్టం కానీ నేను దాన్నుంచి త్వరగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తా. వైఫల్యాలు ఎదురైనప్పుడు… ఒకప్పటి నా పరిస్థితి, ఇప్పుడు నేనున్న స్థాయి, నాకున్న గుర్తింపు, ఎక్కడ పొరపాటు జరిగింది… వంటివన్నీ అన్నికోణాల్లో ఆలోచించుకుని నాకు నేను సర్దిచెప్పుకుంటా. అదేవిధంగా ఒకవేళ నన్నెవరైనా అదేపనిగా విమర్శిస్తున్నా, ట్రోలింగ్‌ చేస్తున్నా ఇంట్లోంచి బయటకు వచ్చి… నన్ను ఒక్కసారైనా చూడాలనుకునే అభిమానులతో కాసేపు మాట్లాడేందుకు ప్రయత్నిస్తా. అలా మాట్లాడినప్పుడు – నాకున్న గుర్తింపు ముందు ఆ విమర్శలు ఏపాటివనిపిస్తుంది.

బ్రేస్‌లెట్‌ ఉండాల్సిందే.. కొన్నాళ్లక్రితం మా నాన్న నాకో బ్రేస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చారు. విలువైన రాయి పొదిగిన ఆ వెండి బ్రేస్‌లెట్‌ పెట్టుకున్నప్పటినుంచీ నాకు అదృష్టం కలిసి వచ్చిందనిపించింది. అందుకే ఎలాంటి సినిమా చేస్తున్నా సరే దాన్ని మాత్రం తీయడానికి ఇష్టపడను.

సల్మాన్​కు నచ్చే ఆహారం.. అమ్మ చేసే దాల్‌, రాజ్మా మసాలా, బిర్యానీ అట. ఇష్టపడే నటీనటులు.. సిల్వెస్టర్‌ స్టెలోన్‌, హేమమాలిని. సల్మాన్​ సినిమాల్లోకి రాకపోయి ఉంటే… రచయిత, పెయింటర్‌, స్విమ్మర్ అయ్యేవాడట. మెచ్చే హాలిడే..స్పాట్‌ పన్వేల్‌లో ఉన్న మా ఫాంహౌస్‌.

తీరిక దొరికితే… ఏ షూటింగ్‌లూ లేనప్పుడు.. నేను పన్వేల్‌లోని మా ఫాంహౌస్‌కు వెళ్లిపోతుంటా. అడవి మధ్యలో ఉండే ఆ ఫాంహౌస్‌లో సైకిల్‌ తొక్కడం, ఈతకొట్టడం, పెయింటింగ్‌, ఆటలు ఆడటం, వ్యాయామాలు చేయడం… గాలిపటాలు ఎగరేయడం… ఇలా నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంటా.

Salman Khan in Shankar Ram Charan Combo movie

ఒక్క అవకాశమూ రాలేదు ఒకప్పుడు నేను చేసిన ‘మైనే ప్యార్‌ కియా’ తరువాత దాదాపు ఏడాది పాటు నాకు ఒక్క అవకాశమూ రాలేదు. ఆ సమయంలో చాలా చికాగ్గా, ఒత్తిడిగా అనిపించేది. చివరకు ఓ రోజు నాన్న… నేనో ప్రముఖ నిర్మాతకోసం పనిచేస్తున్నట్లుగా పత్రికలో ప్రకటన వేయించారు. దాంతో సినిమాలు రావడం మొదలయ్యాయి. వాటిల్లో కొన్ని సెకండ్‌ హీరోగా చేసినవీ ఉన్నాయి. నాకు గుర్తింపు వచ్చేవరకూ ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో అప్పుడు వచ్చిన ప్రతి సినిమాకూ ఓకే చెప్పేవాడిని.

Read more RELATED
Recommended to you

Latest news