హలో మందుబాబులు తాగి తింటున్నారా..? తిని తాగుతున్నారా..?

-

మద్యం తాగడం చెడ్డ అలవాటు అని చాలా మంది అంటారు. కానీ మందుబాబులు మాత్రం అలా అంటే ఒప్పుకోరు. జస్ట్ ఒక పెగ్‌ తాగితే ఏం కాదు అని వాళ్లని వాళ్లు సమర్థించుకుని పెగ్గ్‌తో స్టాట్‌ చేసి ఫుల్‌ బాటిల్‌ లేపేస్తారు. అయితే మీకు మద్యం గురించి ఎలాంటి అవగాహన లేకపోతే చాలా విషయాలు కొత్తగా ఉంటాయి.. మందు తాగేవాళ్లు తాగేముందు అస్సలు తినరు. తిని తాగితే వాంతులు అవుతాయని, తాగలేం అని అంటారు. అందుకే తాగే రెండు గంటల ముందు వరకూ ఏం తినరు. ఇక తాగుతూ ఏదో ఒకటి స్పైసీగా ఉండేవి లాగించేసి అప్పుడు ఫుడ్‌ తింటారు.

ఇదే వాళ్ల రూల్‌.. కానీ నిపుణులు ఏమో తిని తాగమంటున్నారు..? అసలు తిని తాగాలా, తాగి తినాలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. తాగడమే చెడ్డ అలవాటు అంటే మీరేంటండీ మళ్లీ అందులో వేరియేషన్స్‌ చెప్తున్నారు అంటారేమో.. ఇప్పుడు మేం చెప్తే మాత్రం తాగేవాళ్లు మానేస్తారా లేదు కదా..! కనీసం అందులో హెల్త్‌కు ఏది మంచిదో తెలిస్తే ఫాలో అవ్వొచ్చేమో కదా..!

ఖాళీ పొట్టతో ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అలా అని ఆల్కహాల్ తాగాక ఆహారం తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఆల్కహాల్ తాగడానికి ముందే పోషకాహారాన్ని తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆల్కహాల్ తాగాక అది పొట్టలోకి చేరి చిన్న పేగు ద్వారా మీ రక్తంలోకి ప్రవేశిస్తుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఆల్కహాల్ మీ రక్తంలోకి నేరుగా వెళ్లి కలిసిపోతుంది. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఈ పానీయం తాగడానికి ముందు ఏవైనా పోషకాహారాన్ని తినడం చాలా మంచిది.

పొట్టలో ఉన్న ఆహారంలోని నీటి కంటెంట్ మీరు తాగిన మద్యాన్ని పలచగా మారుస్తుంది. ఆల్కహాల్ తాగేసరికే పొట్టలో ఆహారం ఉంటే, ఆ ఆహారంలోని ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ వంటివి ఆల్కహాల్‌ను శరీరం శోషించుకోవడం నెమ్మదించేలా చేస్తాయి. దీనివల్ల ఆల్కహాల్ రక్తంలో ఎక్కువగా కలిసే ఛాన్స్‌ ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరంలో ఆల్కహాల్ వల్ల క్షీణించే విటమిన్లను, ఖనిజాలను తిరిగి అందిస్తుంది.

మద్యం తాగుతున్నప్పుడు ఉప్పు కలిపిన స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. దీనివల్ల మీకు దాహం పెరిగిపోతుంది. శరీరంలో డిహైడ్రేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆల్కహాల్ వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇక మద్యంతో పాటు ఉప్పు నిండిన చిరుతిండి తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఇంకా పెరుగుతుంది.

తాగడానికి ముందు ఇవి తినండి

ఆల్కహాల్ తాగడానికి ముందు పండ్లు, కూరగాయలు వంటివి తినేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన పండ్లు తినడం, దోసకాయ, టమోటోలు, క్యాప్సికం, ముల్లంగి, అరటికాయ వంటి వాటితో వండిన వంటలను తినడం మంచిది. ఆల్కహాల్ తాగేముందు అరటిపండును తింటే ఇంకా మంచిది. దీనిలో ఫైబర్, నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటాయి.

ఇలా అయితే త్వరగా ముసలి వాళ్లు అవుతారు..

మద్యం శరీరంలోకి ఎక్కువగా శోషణకు గురైతే మీరు త్వరగా ముసలివాళ్ళు అయిపోతారు. శరీరం సన్నబడిపోతుంది. వయసు త్వరగా పెరిగినట్టు కనిపిస్తారు. 30 ఏళ్లకే నలభై ఏళ్ల వయసు వచ్చినట్టు కనిపిస్తారు. కాబట్టి ఆల్కహాల్‌ను తాగడం తగ్గించాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అధికంగా తినాలి. ఆల్కహాల్ తాగడానికి పావుగంట ముందే పోషకాహారాన్ని తినండి.

Read more RELATED
Recommended to you

Latest news