IPL 2023 Auction : రేపే ఐపీఎల్‌ మినీ వేలం.. వారిపై కోట్ల వర్షం

-

IPL 2023 Auction : ఐపీఎల్‌ మినీ వేలానికి ముహుర్తం దగ్గర పడింది. ఐపీఎల్ 2023 వేలానికి కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది. రేపు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి వేలం ప్రారంభం కానుంది. ఈ సారి వేలంలో 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 87 మందిని ఎంపిక చేసుకోవచ్చు.

119 మంది ఆటగాళ్లకు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 282 మంది ఆటగాళ్లు అన్ క్యాప్ లిస్టులో ఉన్నారు. 2 కోట్ల బేస్ ప్రైస్ లో 19 మంది, రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్ లో 11 మంది, రూ. కోటి ప్రైస్ లో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ సారి వేలంలో మన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news