మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో 37 ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. ఫైనాన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హిందీ ట్రాన్స్‌లేటర్, ప్రైవేట్ సెక్రటరీ, లైబ్రరీ అసిస్టెంట్ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఇక అర్హత వివరాలని చూస్తే.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ఇంటర్మీడియట్ పూర్తి చేసుండాలి. అలానే ఇంటర్మీడియట్/బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసుండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే…30 నుంచి 57 ఏళ్ల మధ్య వయస్సు వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే జనవరి 18, 2023వ తేదీ వరకు అవకాశం వుంది. గ్రూప్ ఏ పోస్టులకు రూ.1000లు, గ్రూప్ బి పోస్టులకు రూ.500లు కట్టాలి.
గ్రూప్ సీ పోస్టులకు రూ.250లు కట్టాల్సి వుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులు ఫీజు పే చెయ్యక్కర్లేదు. సెలెక్ట్ అయినవారికి రూ.18,000ల నుంచి రూ.2,18,200ల వరకు శాలరీ ని ఇవ్వనున్నారు. ఈ కింద చిరునామాకు అప్లై చెయ్యాల్సి వుంది. చిరునామా: The Recruitment Cell Central University of Jharkhand Cheri-Manatu Campus, P.O.- Kamre P.S. – Kanke, Ranchi-835222 (Jharkhand).