ఐపీఎల్ 2023: అంబటి రాయుడు చెన్నైకు టైటిల్ తో ముగింపు పలుకుతాడా !

-

ఇండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఇప్పటికే అంతర్జాతీయా క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కాగా తెలుస్తున్న సమస్చారం ప్రకారం ఐపీఎల్ కెరీర్ కు కూడా ఈ రోజుతో ముగింపు పలకనున్నాడు. ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహించిన జట్లకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. కాగా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో సభ్యుడుగా కొనసాగుతున్నాడు. ఈ రోజు ఐపీఎల్ సీజన్ 16 లో ఫైనల్ మ్యాచ్ గుజరాత్ తో జరుగనుంది. వాస్తవంగా నిన్నే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఈ రోజుకి వాయిదా పడింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రాయుడు పెద్దగా రాణించింది లేదు, మరి తన చివరి మ్యాచ్ లో అయినా జట్టుకు విలువైన పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్ ను అందిస్తాడా చూడాలి.

ఇక ఇదే మ్యాచ్ తో ధోని కూడా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నాడు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమి జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news