మరికొద్ది సేపట్లో ఐపీఎల్ సీజన్ 16 లో ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ లో చేనై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ లు తలపడనున్నారు. నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడడంతో ఈ రోజు మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో హోమ్ టీం అయిన గుజరాత్ కె ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. ఇందుకు కారణంగా బ్యాటింగ్ లో శుబ్ మాన్ గిల్ మరియు బౌలింగ్ లో రషీద్ ఖాన్ , షమీ , నూర్ అహ్మద్ లు రాణించడమే అని చెప్పాలి. ఇక చెన్నై బ్యాటింగ్ లో ఎదుర్కొంటున్న సమస్య స్పిన్ ను సమర్ధవంతమగా ఆడలేకపోవడమే. అలాంటప్పుడు గుజరాత్ తో స్పిన్ లో రాటుదేలిన రశీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లను ఎదుర్కొని పరుగులు చేయడం ఏమంత సులభం కాదు.
టాప్ బౌలర్ల జాబితాలో మహమ్మద్ షమీ తర్వాత స్థానంలో రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇక నూర్ అహ్మద్ వికెట్లు ఎక్కువగా తీయలేకపోయినా పరుగులను నియంత్రిస్తూ గుజరాత్ క్యూ వికెట్లు తీసే అవకాశాలను అందిస్తున్నాడు. మరి ఈ రోజు చెన్నై ఆటగాళ్లు ఈ స్పిన్ ద్వయాన్ని తట్టుకుని పరుగులు చేయగలరా ?