గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ఘనంగా ప్లే ఆఫ్ లోకి మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అడుగు పెట్టింది. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే చేతులు ఎత్తేసింది. గత మ్యాచ్ లో రాణించిన ఓపెనర్ పృథ్వీ షా 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక సాల్ట్ (3) మరియు రాసౌ (0) లు కూడా చేతులు ఎత్తేయడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. చివరికి ఢిల్లీ పూర్తి ఓవర్ లపాటు ఆడి 9 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితం అయింది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం ఒంటరిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మిగిలిన ఆటగాళ్లు అంతా దారుణంగా ఫెయిల్ అవ్వడంతో ఈ సీజన్ ను ఢిల్లీ ఓటమితో ముగించింది. ఈ మ్యాచ్ లో గెలిచినా చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ప్లే ఆఫ్ కు అర్హత సాధించి రెండవ స్థానంలో ఉంది.