రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు RBI సంచలన ప్రకటన చేసింది. రెండేళ్ల క్రితమే వీటి ప్రింటింగ్ ఆపేసిన RBI ఇప్పుడు అధికారికంగా వాటిని వెనక్కి తీసుకోనుంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ చర్యను ఎత్తిచూపుతూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం ప్రధాని మోదీకి ఐదు ప్రశ్నలు సంధించారు. మీరు ఎందుకు రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టారు?.. త్వరలోనే రూ.500నోట్లను సైతం ఉప సంహరిస్తారని అనుకోవచ్చా?, 70కోట్ల మంది భారతీయులకు స్మార్ట్‌ఫోన్ లేదని, వారు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారు ? అని ప్రశ్నించారు.
డెమో 1.0 అండ్ 2.0 చేయడంలో బిల్ గేట్స్ పాత్ర ఏంటీ..? ఎన్‌పీసీఐ చైనా హ్యాకర్లచే హ్యాకింగ్‌కు గురైందా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 30 తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే రూ.2వేల పరిస్థితి ఏంటంన్నది ఆర్‌బీఐ వెల్లడించలేదు. అంతకు ముందు డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత రద్దు చేసిన రూ.500, రూ.100నోట్లను తమ వద్ద ఉంచుకోవడం నేరమని ప్రభుత్వం పేర్కొంది. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రాత్రికి రాత్రే చెల్లుబాటు కాకుండా నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది.