టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రహమానుల్లా గుర్బాజ్ ఈ మ్యాచ్ లో మాత్రం డక్ అవుట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కాస్తో కూస్తో ఫామ్ లో ఉన్న జాసన్ రాయ్ కూడా దక్కిన మంచి స్టార్ట్ ను ఉపయోగించుకోలేక 20 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు భారమంతా కెప్టెన్ నితీష్ రానా మరియు రింక్ సింగ్ ల మీద పడింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ జట్టును పెద్ద ప్రమాదం నుండి బయటపడేశారు.
వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 61 పరుగులు జోడించారు. నితీష్ రానా కుదురుకుంటున్న సమయంలోనే మార్కరం బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ నిలబడకుంటే జట్టు స్కోర్ చాలా తక్కువయ్యేది.